
సిస్ట్ అనేది ద్రవం, వాయువు, చీము లేదా ఏదైనా ఇతర పదార్థంతో నిండి ఉండి మెలితిరిగి మూసివేసి ఉన్న సంచిలాంటి నిర్మాణం. ఇది శరీరంలోని ఏదైనా కణజాలంలో కూడా కనిపించవచ్చు. ఇంకా వీటిలో అధికశాతం క్యాన్సర్ లేనివి. అవి ఎలాంటి రకమో, అవి ఏర్పడిన స్థానం ఆధారంగా, వైద్యులు ఆ తిత్తిని తొలగించడానికి అవసరమైన శస్త్రచికిత్స విధానాన్ని నిర్ణయిస్తారు. వీటిలో ఒక రకమే ఈ సెబాషియస్ సిస్ట్. ఇది అంతా అపాయకరం కాదు. సేబాషియస్ సిస్ట్ ముఖ్యంగా చర్మం, మెడ లేదా దిగువ శరీరంలో ఎక్కడైనా వస్తుంది. ఇది అంత తీవ్రమైనది కాదు. కానీ అది పెరుగుతున్న కొద్ది అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది క్యాన్సర్ తిత్తిగా మారే అవకాశాలు చాలా తక్కువ. ఇవి పసుపు లేదా తెలుపు వర్ణంలో ఉంటాయి. సాధారణంగా వీటిని స్వయంగానే తెలుసుకోవచ్చు. ఇందుకోసం ల్యాబ్ పరీక్షలు లేదా ఇమేజింగ్ పరీక్షల అవసరం ఉండదు. మీరు ఈ సిస్ట్‌కి చికిత్స తీసుకోవచ్చు లేదా కొన్నిసార్లు అదే నయమైపోతుంది లేదా తీసేయాల్సి వస్తుంది. కానీ చికిత్స చేయించకుండా అలా వదిలేయకూడదు. లేకపోతే, అది మీ జీవితాంతం అలాగే ఉండే అవకాశముంది. ఈ సిస్ట్‌లలో అనేక రకాలు ఉన్నాయి. బహుశా వందల రకాలు ఉండి ఉండవచ్చు. అయితే ఇవి అరచేతిలో లేదా అరికాళ్లలో మాత్రం ఎప్పుడూ ఏర్పడవు.
మీ శరీరంలో ఉండే సేబాషియస్ గ్రంథి నుంచి సేబాషియస్ సిస్ట్ ఏర్పడుతుంది. సేబాషియస్ గ్రంథులు నూనెను స్రవిస్తాయి. ఇది జుట్టు ఇంకా చర్మంపై పూతను ఏర్పరుస్తుంది. అలాగే సిస్ట్‌గా కూడా మారే అవకాశముంది. ఈ నూనె ప్రయాణించే మార్గం దెబ్బతిన్నప్పుడు లేదా ఆ మార్గానికి ఏదైనా అడ్డుపడినప్పుడు ఈ సిస్ట్‌లు ఏర్పడతాయి. ఆ ప్రాంతంలో ఏదైనా గాయం ఉన్న కూడా ఇవి ఏర్పడతాయి. గీరుకున్నపుడు, మొటిమలు, శస్త్రచికిత్స లేదా చర్మ వ్యాధి వల్ల ఇలాంటి గాయాలు కావచ్చు. సిస్ట్ చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. గాయపడిన నెల లేదా రెండు నెలల తర్వాత ఆ ప్రదేశంలో సిస్ట్ ఏర్పడవచ్చు.
i) ఏదైనా శస్త్రచికిత్స సమయంలో కణాలకు నష్టం వాటిల్లినపుడు
ii) అవాంచనీయ ఘటనలు లేదా గ్రంథుల నాళాల వైకల్యం
iii) బేసల్ సెల్ నరాల వ్యాధి లేదా గార్డనర్స్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన కారణాలు.
ఇది క్యాన్సర్ అయితే, ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది -
i) సిస్ట్ 5 సెం.మీ కంటే పెద్దదైన వ్యాసం కలిగి ఉంటుంది
ii) ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్లీ తిరగబెడుతుంది
iii) ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు.
డాక్టరు సిస్ట్ నుంచి చీమును తీసివేయడం లేదా శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించడం లాంటి చికిత్సలు చేయవచ్చు. వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం ఉత్తమం. ఎందుకంటే ఇతర చికిత్సల వల్ల ఈ సిస్ట్‌లు తిరిగి వచ్చే అవకాశముంది. సిస్ట్‌లను తొలగించడానికి డాక్టర్లు క్రింది పద్ధతుల్లో ఒకదాన్ని ఉపయోగిస్తారు.
1) కన్వెన్షనల్ వైడ్ ఎక్సిషన్ (సంప్రదాయ విస్తృత ఛేదనం) - ఈ శస్త్రచికిత్స ద్వారా సిస్ట్‌ని పూర్తిగా తొలగించవచ్చు, కానీ పెద్ద మచ్చ పడే అవకాశం ఉంది. సిస్ట్ పునరావృతమయ్యే అవకాశాలు ఉండవు.
2) మినిమల్ ఎక్సిషన్ (కనిష్ట ఛేదనం) - ఈ పద్ధతి తక్కువ మచ్చలను కలిగిస్తుంది. కానీ మళ్లీ సిస్ట్ తిరిగి వచ్చే ప్రమాదం ఉంది.
3) పంచ్ బయాప్సీ ఎక్సిషన్ - లేజర్ సహాయంతో ఒక చిన్న రంధ్రం చేస్తారు. ఇది సిస్ట్ నుంచి వ్యర్ధాలను బయటకు పంపిస్తుంది.
చికిత్స తర్వాత, ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి డాక్టర్ యాంటీబయోటిక్ లేపనాన్ని ఇస్తారు. వైద్య ప్రక్రియ పూర్తయ్యే వరకు దానిని ఉపయోగించాలి. ఏదైనా శస్త్రచికిత్స సంబంధ మచ్చలు మిగిలి ఉంటే.. వాటిని తగ్గించే క్రీమ్ కొరకు డాక్టరుని అడగవచ్చు. తద్వారా ఏదైనా శస్త్రచికిత్స మచ్చలు ఉండిపోయినట్లయితే వాటిని తగ్గించుకోవచ్చు.
1) CT స్కాన్‌లు - సిస్ట్ లక్షణాలను పరిశీలించడానికి ఇంకా దాని చికిత్సకు సరైన విధానాన్ని తెలుసుకునేందుకు డాక్టర్లకు ఈ పరీక్ష సహాయపడుతుంది.
2) అల్ట్రాసౌండ్లు - ఇవి సిస్ట్ లోపల ఏముందో గుర్తించడంలో సహాయపడతాయి.
3) పంచ్ బయాప్సీ అంటే.. క్యాన్సర్ ఉనికిని ప్రయోగశాలలో తెలుసుకోడానికి సిస్ట్ నుంచి కొంత కణజాలాన్ని తీసుకోవడం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ఎల్ఎంపీ, అల్ట్రాసౌండ్ స్కాన్ మధ్య తేడాలు
సేబాషియస్ సిస్ట్‌లు క్యాన్సర్ లేనివి లేదా ప్రమాదకరమైనవి కావు. కానీ చికిత్స చేయకపోతే ఇవి పెరిగి పెద్దవిగా, బాధాకరంగా ఇంకా అసౌకర్యం కలిగించేలా మారవచ్చు. శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా దీనిని తొలగించినట్లయితే, సిస్ట్ తిరిగి వచ్చేందుకు కేవలం 1% అవకాశం మాత్రమే ఉంటుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే తొలగించిన ప్రాంతానికి ఇది సోకుతుంది. ఆ ప్రదేశం ఎర్రబారడం లేదా నొప్పిగా అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అందువల్లే శస్త్ర చికిత్స తర్వాత యాంటీబయోటిక్ ఆయింట్‌మెంట్లు రాయాల్సి ఉంటుంది. చికిత్స చేయకపోతే ఇది ప్రమాదకరం కావచ్చు.
This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |